Site icon NTV Telugu

Rajnath Singh: “వారే మా టార్గెట్” రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh

Rajnath Singh

పహల్గామ్‌లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించారని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

READ MORE: Tharun Bhascker: విశ్వక్’ను పక్కన పెట్టి దేవరకొండతో తరుణ్ భాస్కర్?

ప్రధాని నేతృత్వంలో శత్రువులకు తగిన సమాధానం చెప్పామన్నారు. భారత సైన్యం సత్తాను చాటిందని కొనియాడారు. సైన్యం మనం గర్వపడేలా చేసిందన్నారు. పాకిస్థాన్ పౌరుల ప్రాణాలకు నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసినట్లు స్పష్టం చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించినట్లు చెప్పారు. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు. సుందర్‌కాండ్‌లోని ఓ శ్లోకాన్ని వివరించారు. ఈ దాడిని సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. ఈ ఆపరేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందని, దీని విజయం దేశ భద్రతా విధానం యొక్క బలాన్ని ప్రపంచానికి ప్రదర్శించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

READ MORE: Pakistan: ఉగ్రవాదుల సామూహిక అంత్యక్రియలు.. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హాజరు, వీడియోలు వైరల్..

 

Exit mobile version