ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ చర్యను శాంతికి భంగం కలిగించే పిరికి ప్రయత్నంగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ‘ఎర్రకోట కారు పేలుడు ఘటనపై దేశంలోని…
Pakistan: భారత ఆర్మీ, రాజకీయ నాయకులు ఇటీవల పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా కవ్వింపులకు పాల్పడితే పాకిస్తాన్ చరిత్ర, భౌగోళిక స్వరూపం మారిపోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే, ఈ వార్నింగ్‌లపై పాకిస్తాన్ స్పందించింది. రెండు దేశాల మధ్య భవిష్యత్ వివాదాలు ‘‘ తీవ్రమైన నాశనానికి’’ దారి తీస్తాయని హెచ్చరించింది. ఈ బాధ్యతారహిత ప్రకటనలు కవ్వించే ప్రయత్నమని పాక్ ఆరోపించింది.
పహల్గామ్‌లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు…