Gujarat ATS Raids: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మంగళవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహియుదిన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్‌లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి…
Pahalgam terrorists: జమ్మూ కాశ్మీర్‌లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన రెండు నెలల తర్వాత.. సైన్యం ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసింది. పూంచ్, రాజౌరి జిల్లాల సరిహద్దులోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలో చొరబాటుకు ప్రయత్నిస్తుండగా పాక్ జాతీయుడిని అరెస్టు చేసింది. అయితే.. ఈ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
PM Modi: పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు భారతదేశ ‘‘నారీ శక్తి’’ని తక్కువగా అంచనా వేసి తమ వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల ముందే భర్తల్ని ఉగ్రవాదులు చంపారు. ఈ సంఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద విజయవంతమైన చర్యగా ప్రధాని ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ కింద సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చర్య తీసుకున్న తర్వాత, భద్రతా దళాలు ఇప్పుడు సరిహద్దు లోపల అంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనిక చర్యను ముమ్మరం చేశాయి. షోపియన్‌తో సహా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు అడవిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు…
పహల్గామ్‌లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు…