Operation Sindoor: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ సైనిక చర్యకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరిగిన గత అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు నిన్ననే సమావేశమై ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అయితే.. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్…
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పాకిస్థాన్ కోలుకునే అవకాశం లేకుండా చేసింది. రాత్రి 1:05 నుంచి 1:30 వరకు భారత సైన్యం చేసిన దాడి పాకిస్థాన్ సైన్యాన్ని కుదిపేసింది. దాడి ముగిసిన 25-30 నిమిషాల వరకు.. పాకిస్థాన్ ఎలా స్పందించాలో అర్థం కాలేదు. నిమిషాల వ్యవధిలో మొత్తం అయిపోయింది. కాగా.. ఈ దాడి తరువాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. భారత ‘సైనిక రైళ్ల’ కదలికల గురించి తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థలు…
పహల్గామ్‌లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు…