రజనీకాంత్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఈయనను ముద్దుగా ‘తలైవా’ అంటూ పిలుస్తారు. సినిమాలను ఎక్కువగా ఆదరించే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి వరుసలో ఉండగా.. అక్కడ రజనీకాంత్ కు వందల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే..
Also read: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలలో ఒకటి ‘వేట్టైయన్’. ఈ సినిమాకు సంబంధించి నేడు ఆ సినిమా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా రిలీజ్ అప్పుడే అంటూ తెలిపారు. ఈ సినిమా సంబంధించి రజనీకాంత్ తో ఓ పవర్ ప్యాకెడ్ థ్రిల్లర్ సినిమాను ఎక్కించబోతున్నట్లు మూవీ మేకర్స్ వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. ఇక ఈ పోస్టుకు అనుసరించి వారు క్యాప్షన్ కూడా ఇచ్చారు. అందులో ‘మార్పు చాలా ఎక్కువ. వేట్టైయన్ ఈ సంవత్సరం అక్టోబర్ లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. ఎరను వెంబడించడానికి సిద్ధంగా ఉండు” అంటూ మూవీ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక మూవీ మేకర్స్ ఇంగ్లీష్, తమిళ్ భాషలలో ఉన్న 2 పోస్టర్స్ ను షేర్ చేశారు.
Also read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలని యూనివర్సిటీ ఆదేశం..
ఇక ఈ పోస్టర్లో రజనీకాంత్ తనదైన స్టైల్ లో కూల్ షేడ్స్ ధరించి తన చేతిలో తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు కనపడతాడు. ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి నెటిజెన్స్ స్పందిస్తూ.. వెయిటింగ్ తలైవా అంటూ కొందరు అంటుండగా.. మరికొందరైతే వేటగాడు తన మార్కును మర్చిపోవడం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.