NTV Telugu Site icon

Rajinikanth : నేడు విజయవాడకు సినీనటుడు రజనీకాంత్‌

Rajinikanth

Rajinikanth

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు.. నేడు విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారు. ఈరోజు సాయంత్రం విజయవాడలోని పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ మరియు చారిత్రక ప్రసంగాల ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. అయితే.. రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : Manipur: సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు.. ఆ జిల్లాలో ఇంటర్నెట్ బంద్

సాయంత్రం నుంచి కేవలం అనుమతి ఉన్న వారికే అనుమోలు గార్డెన్స్‌లో ప్రవేశం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ మీద రూపొందించిన పలు లఘుచిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నెలరోజుల పాటు 100ప్రాంతాల్లో 100 వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు నివాసానికి రజనీకాంత్, బాలకృష్ణ వెళ్తారు. అక్కడి నుంచి వారు ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గోనున్నారు.

Also Read : Shanvi Srivastava : లవ్లీ బేబీ.. ఇంత హాట్ గా అప్పుడు చూపిస్తే బ్రేక్ వచ్చేదిగా

Show comments