మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్నా విషయం తెలిసిందే.. ఇక స్టార్ హీరోల పోలికలతో అటు, ఇటుగా దగ్గర పోలికలు ఉన్న వాళ్లు ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు.. ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. దాదాపు వాళ్ళ లుక్స్ చూస్తే అచ్చు మన సెలెబ్రిటీలలాగే కనపడి ఆశ్యర్యపరుస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే ఉన్న ఓ పెద్దాయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఈ మధ్య కాలంలో మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు. దీంతో నాదిర్ షా ఆశ్చర్యపోయాడు. తెల్ల గడ్డం, బట్టతల, కళ్ళజోడు పెట్టుకొని దూరం నుంచి చూస్తే అచ్చు సూపర్ స్టార్ రజినీకాంత్ లాగే కనపడుతుండటంతో నాదిర్ అతనితో ఫోటో దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. దీన్ని చూసిన వారంతా నిజంగా రజినీకాంత్ లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
ఆ దెబ్బకి ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అతని పేరు సుధాకర్ ప్రభు. నాదిర్ షా అచ్చు రజినీకాంత్ లాగే ఉన్న సుధాకర్ ప్రభు ఫోటోలు షేర్ చేయడంతో వార్తల్లో నిలిచాడు ఆ వ్యక్తి. దీంతో ఆ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా అతన్ని చూడటానికి వస్తున్నారట జనాలు… అలా జనాల వల్ల అతని బిజినెస్ పెరుగుతుందా లేదా ఫెమస్ అవ్వడంతో తగ్గుతుందా చూడాలి..