NTV Telugu Site icon

Crime News: మత్తుమందు ఇచ్చి.. 14 రోజుల పాటు వితంతువుపై సామూహిక అత్యాచారం!

Gang Rape

Gang Rape

Women Was Gang Raped by 6 Men in Rajasthan: రాజస్థాన్‌లోని దారుణం చోటుచేసుకుంది. పహాడీ సబ్‌ డివిజన్ పరిధిలో ఓ వితంతువుకు మత్తుమందు ఇచ్చి.. కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఆరుగురు కామాంధులు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పహాడీ సబ్‌ డివిజన్ పరిధిలో భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో ఓ మహిళ జీవిస్తోంది. ఆమెకు ఉద్యోగం ఆశ చూపి.. ఓ వ్యక్తి చేరువయ్యాడు. మహిళపై కెన్నేసిన ఆ వ్యక్తి.. తన అయిదుగురు స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడు. ఉద్యోగం విషయమై మాట్లాడుదాం రమ్మని ఆ వ్యక్తి మహిళకు చెప్పాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. శీతల పానీయం తాగిన మహిళను భరత్‌పుర్‌లోని ఓ హోటలుకు ఆమెను తీసుకువెళ్లాడు.

Also Read: Disney+ Hotstar-Reliance: జియో దెబ్బకు ఆగమాగం అవుతున్న స్టార్ స్పోర్ట్స్‌.. ఇక అంబానీ చేతికి..!

మహిళను అక్కడే నిర్బంధించి ఆరుగురూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆరుగురు 14 రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆ కామాంధుల ఉచ్చు నుంచి బయటపడిన మహిళ.. కామా పోలీస్ స్టేషనులో నిందితుల పేర్లతో సహా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ దేశ్‌రాజ్‌ కుల్దీప్‌ చెప్పారు.

Show comments