Rajashekar: టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ మనసు మారినట్లుంది. వెబ్ సిరీస్ లలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ కథనాలు బాగుంటే వెబ్ సిరీస్ లలో నటించేందుకు తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల ప్రకటించారు. రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్ గా, రాజ్ తరుణ్ హీరోగా రూపొందించిన ‘ఆహా నా పెళ్లంట’ తాజాగా జీ5 ఓటీటీ వేదికగా విడుదలై యూత్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. ఎనిమిది ఎపిసోడ్స్ తోఉన్న దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Sudigali Sudheer: రష్మీని నేను ఇప్పటివరకు పట్టుకోలేదు.. ముట్టుకోలేదు.. మా పెళ్లి అయితే..
ఈ సక్సెస్ మీట్ కు రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ సినిమా స్థాయిలో ఉందని కొనియాడారు. ఈ వెబ్ సిరీస్ ను సంజీవరెడ్డి ఆకట్టుకునే రీతిలో రూపొందించారని అభినందించారు. ఇంత మంచి సిరీస్ ను రూపొందించినందుకు జీ5కు అభినందనలు తెలిపారు. పెళ్లి నేపథ్యంలో వచ్చే కథనం ఆకట్టకుందని చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా వేదికపై నటీనటులతో కలిసి రాజశేఖర్ చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా, రాజశేఖర్ గత వేసవిలో శేఖర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా, పవన్ సాధినేని దర్శకత్వంలో ‘మాన్ స్టర్’ సినిమా చేస్తున్నారు. సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.