రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలోతెరకెక్కిన రాజాసాబ్ భారీ అంచనాల మధ్య గత రాత్రి ప్రీమియర్స్ షోస్ తో థియేటర్లోకి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక నాచే నాచే సాంగ్ థియేటర్లు తగలబడిపోతాయ్.. అనే హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఓవర్సీస్ రివ్యూ ఎలా ఉందొ చూద్దాం..
ప్రభాస్ నటించిన గత చిత్రాల ఫొటోస్ తో అదిరిపోయే రెబల్ స్టార్ ఎంట్రీ కార్డుతో మొదలైన రాజాసాబ్ ప్రభాస్ కూల్ ఎంట్రీతో ఫ్యాన్స్ కు మంచి హై ఇచ్చాడు. కానీ ఆ తర్వాత నుండే అసలు సినిమా మొదలవుతుంది. కథ స్టార్ట్ అయినప్పుడే ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కామెడీ సీన్స్ ఉన్న అవి చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. పనికిరాని ఓల్డ్ స్కూల్ అంశాలతో బోర్ ఫీల్ కలిగించాడు దర్శకుడు. ముఖ్యంగా ప్రభాస్ కు సంబంధించి కొన్ని VFX షాట్లు చాలా పేలవంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు నుండి మాత్రమే కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఫస్టాప్ మొత్తంలో కేవలం రెబల్ స్టార్ నటన మాత్రమే బాగుంటుంది. ఓవరాల్ గా డీసెంట్ ఫస్టాఫ్ అనే చెప్పొచ్చు.
ఇక సెకండాఫ్ అయితే మరింత కలగూరగంపలా తయారయింది. కానీ చివరి 30 నిముషాలు చాలా బాగా ఆకట్టుకుంది. కానీ అప్పటికే ప్రేక్షకులు డిసప్పోఇంట్ లో ఉండదంతో క్లైమాక్స్ ని వావ్ అని ఫీల్ అవలేడు. ఓవరాల్ గా ఈ సినిమా విశ్లేషించి చుస్తే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను అనవరసరమైన హంగులు జోడించి నీరుకార్చేసారు. వింటేజ్ ప్రభాస్ తో హారర్/ఫాంటసీ డ్రామాలో అక్కర్లేని అంశాలు జోడించి ఆడియెన్స్ ని అలసిపోయేలా చేసింది. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్న దాని చుట్టూ అల్లుకున్న కొన్ని సన్నివేశాలు బాగా పనిచేస్తాయి, ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్. హారర్ సినిమా అని హైప్ ఇచ్చి ఒక్క భయపెట్టే సన్నివేశాలు లేకపోవం మారుతికె చెల్లింది. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మేజర్ మైనస్. థమన్ సంగీతం ఓకే ఓకే.