Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
- రాజమండ్రి కేంద్రంగా రూ. 25 కోట్ల భారీ మోసం వెలుగులోకి
- అగరబత్తీల తయారీ పేరుతో సుమారు 3,000 మంది మహిళలను మోసం
- ఒక్కొక్కరికి రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ. 12,500 ఇస్తామని హామీ
- అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ కీలక నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agarbatti Scam: రాజమండ్రి కేంద్రంగా సాగుతున్న భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అగరబత్తీలు, ఇతర వస్తువుల తయారీ పేరుతో సుమారు 3,000 మంది మహిళలను నమ్మించి, వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ముంచేసిన ఉదంతంపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇంటి వద్దే ఖాళీగా ఉండే మహిళలకు ఉపాధి కల్పిస్తామంటూ ఆశ చూపాడు.
RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇందులో భాగంగా అగరబత్తీలు, ఇతర గృహోపకరణాలు తయారు చేస్తే వాటిని తిరిగి తమ సంస్థే కొనుగోలు చేస్తుందని నమ్మించాడు. అయితే ఈ పథకంలో చేరాలంటే ఒక్కొక్కరు రూ. 1 లక్ష డిపాజిట్ చేయాలని, అలా చేస్తే నెలకు రూ. 12,500 చొప్పున ఆదాయం వస్తుందని భారీ ఆఫర్ ప్రకటించాడు. ఈ స్కీంను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంధ్యారాణి అనే మహిళ ద్వారా యూట్యూబ్ లో వీడియోలు చేయించి విపరీతమైన పబ్లిసిటీ కల్పించారు. ఈ ప్రచారానికి ఆకర్షితులైన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ఇతర జిల్లాలకు చెందిన మహిళలు లక్షలాది రూపాయలు డిపాజిట్ చేశారు. దాదాపు 3,000 మంది బాధితులు సుమారు రూ. 25 కోట్ల వరకు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినట్లు ప్రాథమిక అంచనా.
గత నాలుగు నెలలుగా డిపాజిట్ దారులకు రావాల్సిన నెలవారీ ఆదాయం నిలిచిపోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. అలాగే నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన మహిళలు, రాజమండ్రిలోని సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పులు చేసి మరీ డబ్బులు కట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?
బాధితుల ఫిర్యాదు మేరకు రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు మోహన్ కృష్ణకు రాజకీయ అండదండలు ఉన్నాయని, అందుకే తాము నష్టపోయే ప్రమాదం ఉందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సొమ్మును తిరిగి ఇప్పించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!