RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: తిరుపతి డీబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం, అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే రెండేళ్లలో అమరావతికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని, అదే వేగంతో కొనసాగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 100 ఏళ్లకుపైగా పడుతుందని విమర్శించారు.
Read Also: స్టైలిష్ లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో Volkswagen Taigun.. ఈ SUV మార్కెట్‌లోకి వచ్చేది ఎప్పుడంటే..?
Also Read
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు రోజా.. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పథకాన్ని నిలిపివేయడం అంటే ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమేఅన్నారు.. 87 శాతం పూర్తయిన ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని.. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పాదయాత్ర చేపట్టి మహా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!