కొత్త అధ్యక్షుడిని డమ్మీ డమ్మీ అని అందరన్నారని.. తాను డమ్మిని కాదు మమ్మీకి డాడీని అన్న రామ్ చందర్ రావుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానన ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామ్ చందర్ రావుకు ఇది మంచి అవకాశమన్నారు. ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని.. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసీ ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు కొట్లాడాలని తెలిపారు. హైడ్రా వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయని.. పేదలకు ఒక న్యాయం, ఫాతిమా కాలేజ్ కు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. రంగనాథ్ కు ఫాతిమా కాలేజ్ కూల్చడానికి ధైర్యం చాలడం లేదా? అని నిలదీశారు.
READ MORE: Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లో ముగిసిన తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు!
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు.
READ MORE: Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ.. సీఎం ఏం చెప్పారంటే..?
