Site icon NTV Telugu

Raja Singh : కవిత మాట్లాడినది నిజమే.. పెద్ద ప్యాకేజీ దొరుకుతే కలిసిపోతారు..!

Raja Singh

Raja Singh

Raja Singh : తెలంగాణ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అడ్డుగా ఉన్న తనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అయితే.. కవిత కామెంట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని తాను భావిస్తున్నానంటూ తెలిపారు. బీజేపీకి చెందిన కొంతమంది నేతలు పెద్ద ప్యాకేజీ లభిస్తే బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించారు.

Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌.. బెస్ట్‌ సినిమాగా కల్కి..!

“ప్రతి ఎన్నికల్లో మా వాళ్లు కుమ్ముకైపోతారు, అందుకోసమే బీజేపీకి ఎంతో నష్టం జరిగింది” అని రాజాసింగ్ అన్నారు. “ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినది, ఎందుకు అనే విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని ఆయన పేర్కొన్నారు. “చెబితే వారిని సస్పెండ్ చేస్తారు. అందుకే కార్యకర్తలు గానీ, నాయకులు గానీ పాపం నోరు మూసుకొని కూర్చుంటున్నారు” అని ఆయన వాపోయారు.

Gaddar Awards 2024: గద్దర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!

Exit mobile version