Gaddar Awards 2024: గద్దర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Awards 2024: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్, సైమా వంటి వివిధ అవార్డులు సినీ రంగానికి చెందిన వారికి గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నంది అవార్డులు’ ప్రకటించేది. అయితే ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం అవి నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొన్నేళ్ల పాటు ఈ అవార్డులపై ఎటువంటి దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ‘గద్దర్ సినీ అవార్డులు’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Khaleja Re-Release: మే 30న థియేటర్స్‌లో పండగే.. ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్..!
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ఈ అవార్డుల నిర్వహణకు ప్రముఖ నటి జయసుధ ఛైర్ పర్సన్ గా ఒక ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మొత్తం 1248 నామినేషన్లు రాగా, జ్యూరీ సభ్యులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తమ చిత్రాలను, నటీనటులను ఎంపిక చేశారు. ఈ అవార్డులను తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి జయసుధ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ గద్దర్ అవార్డ్స్ 2024 ఫుల్ లిస్ట్ ఇలా ఉంది.
Read Also: Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. బెస్ట్ సినిమాగా కల్కి..!
బెస్ట్ ఫిలిం – కల్కి 2898AD
బెస్ట్ సెకండ్ ఫిలిం – పొట్టెల్
బెస్ట్ థర్డ్ ఫిలిం – లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్(పుష్ప 2)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35)
ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్(కల్కి)
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం – కమిటీ కుర్రోళ్ళు
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం – 35 ఇది చిన్న కథ కాదు
బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ – రజాకార్
బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ – యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
బెస్ట్ ప్రజాదరణ చిత్రం – ఆయ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – SJ సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన – నిజమే చెబుతున్న సాంగ్)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – శ్రేయ ఘోషల్ (పుష్ప 2 – సూసీకి సాంగ్)
బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్నకథ కాదు), మాస్టర్ హారిక (మెర్సీ కిల్లింగ్)
బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – విశ్వనాధ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ – అరవింద్ మీనన్ (గామి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ మాస్టర్ – దేవర – ఆయుధ పూజ సాంగ్
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – అధినితిన్ జిహాని చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – నల్ల శీను (రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యురి అవార్డులు:
స్పెషల్ జ్యురి అవార్డు(హీరో) – దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యురి అవార్డు (హీరోయిన్) – అనన్య నాగళ్ళ (పొట్టెల్)
స్పెషల్ జ్యురి అవార్డు (డైరెక్టర్) – సుజీత్, సందీప్ (క)
స్పెషల్ జ్యురి అవార్డు (నిర్మాత) – ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
జ్యుటి స్పెషల్ మెన్షన్ (సింగర్) – ఫారియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా – మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్).
తాజావార్తలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!