పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హార్రర్ కామెడి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రాగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడప్ చేసే పనిలో ఉంది. డిసెంబర్ 27న హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : SigmaTeaser : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్.. ‘సిగ్మా’ టీజర్ రిలీజ్
ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ రాజాసాబ్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే.. రన్ టైం కూడా రివీల్ అయింది. ఈ సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలు.. అంటే, మూడు గంటల మూడు నిమిషాలు అన్నమాట. మామూలుగా అయితే పెద్ద సినిమాలు ఇంచు మించు భారీ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు రాజాసాబ్ కూడా అలాగే రాబోతోందని చెప్పొచ్చు. కానీ ఓ సినిమాకు క్రిస్పి రన్ టైం చాలా అవసరం. అలాగే.. మారుతి అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చొబెట్టగలడా? అనే చర్చ జరుగుతోంది. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న వింటేజ్ వైబ్ మూవీ కావడడంతో.. మారుతి భారీ రన్ టైంతో రిస్క్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కూడా వింటేజ్ డార్లింగ్‌ను చూడ్డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు కంటెంట్ బలంగా ఉంటే రాజాసాబ్‌కు తిరుగుండదనే చెప్పొచ్చు. మరి రాజాసాబ్ ఎలా అలరిస్తాడో చూడాలి.