Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad Rains: భానుడి భగభగలతో అల్లాడి పోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కాస్త ఊరట కలిగించింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో అర్థరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్ అర్బన్‌లో 22.8 మిమీ వర్షపాతం నమోదు కాగా.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి లో 9 మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా ఎడ్‌బిడ్‌లో 7.3 మి.మీ. వర్షం కురిసింది. ఉగాది పండుగకు చల్లటి వాతావరణం ఏర్పడడంతో ప్రజలకు కాస్త ఎండనుంచి ఊరట లభించిందనే చెప్పాలి. మరి ఈ రెండు రోజులు చిరుజల్లులతో నేల తడియడంతో రైతులకు కూడా ఇది శుభవార్తే అని చెప్పాలి.
Read Also: Srisailam Temple: శ్రీశైలంలో నేటితో ముగియనున్న ఉగాది మహోత్సవాలు
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిప్పులు చెరుగుతున్న ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నడూ లేని విధంగా 44 డిగ్రీలకు చేరువ కావడం, వడగాలుల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రానున్న రెండు రోజుల పాటు ఎండల తీవ్రత తక్కువగానే ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటనతో జిల్లావాసులకు ఊరట లభించింది. రానున్న రెండు రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని సమాచారం. దీంతో గత వారం రోజులుగా మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జిల్లా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!