తెలుగు రాష్ట్రాలపై రుతుపవనాలు తీవ్ర ప్రభావాలు చూపుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది.