NTV Telugu Site icon

NIA Raids: గ్యాంగ్‌స్టర్లను వెంటాడుతున్న ఎన్‌ఐఏ.. కీలక సమాచారంతో 8 రాష్ట్రాల్లో దాడులు

Nia Raids

Nia Raids

NIA Raids: గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు. దేశ రాజధాని, మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాను ప్రభుత్వం తీవ్ర ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఎన్‌ఐఏ నుంచి ఈ చర్య వచ్చింది.

ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు యువకులను రిక్రూట్ చేయడానికి, నిధుల సేకరణకు, విదేశాల్లోని క్రిమినల్ ముఠాలు పన్నుతున్న కుట్రపై దర్యాప్తు చేయడానికి ఎన్‌ఐఏ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నుంచి గత ఏడాది రెండు కేసులను తిరిగి నమోదు చేసింది. ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడంతో పాటు బెదిరించినట్లు కేసు నమోదు చేసింది. ఉత్తర భారత్‌లో ప్రత్యేకించి ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు పెరుగుతున్నట్లు గుర్తించిన ఎన్‌ఐఏ.. గ్యాంగ్‌స్టర్లపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఒక్క పంజాబ్‌లోనే 30 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు

నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగానే ఎన్‌ఏఐ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్లను లక్ష్యంగా చేసుకుని ఇలా సోదాలు నిర్వహించడం ఇది నాలుగోసారి. కాగా.. దేశంలోని పులు నగరాల్లో గ్యాంగ్‌స్టర్లు ఉగ్రకార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ వీరిపై ఉక్కుపాదం మోపుతోంది.

Show comments