Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra On Break: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. కీలక సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర మార్చి 2న పునఃప్రారంభవుంటుందని జైరాం రమేశ్ తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు కూడా వెళ్లనున్నారు. ఫిబ్రవరి 27, 28 తేదీలలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. బ్రిటన్ పర్యటనలో రాహుల్ రెండు ఉపన్యాసాలు ఇవ్వనున్నారు.
Also Read: Virat Kohli-Akaay: భారతదేశం మొత్తం ఈరోజు హాయిగా నిద్రపోతుంది!
మార్చి 2న భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం కానుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ మార్చి 5న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారని జైరాం రమేష్ తెలిపారు. ప్రస్తుతానికి భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లలో ముగిసింది.