పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంపై దుమారం రేపుతోంది. రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని స్పీకర్, అధికార సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పాత్రను, బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేశారు. స్పీకర్‌కు తన నిరసనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
‘‘దేశ భద్రతపై లోకసభలో మాట్లాడేందుకు తనకున్న హక్కును అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 2020లో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ, ఉద్రిక్తతలను లోకసభలో గత సోమవారం ప్రస్తావిస్తుండగా తాను ఉటంకించే ‘‘మ్యాగజైన్’’ లోని అంశాల ప్రామాణికత, విశ్వసనీయతకు బాధ్యత వహించాలని స్పీకర్ ఆదేశించారు. లోక్‌సభ సంప్రదాయాలకు లోబడి.. గతంలో పలు సందర్భాల్లో స్పీకర్లు ఇచ్చిన ‘‘రూలింగ్”లకు అనుగుణంగా తాను ప్రస్తావించే అంశాలకు బాధ్యత వహించాలన్న నిబంధనను పాటించాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘స్పీకర్ అనుమతితో (పుస్తకం, మ్యాగజైన్), పత్రంలోని అంశాలను సభ్యుడు ప్రస్తావించిన తర్వాత వాటికి ప్రతి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అంతటితో స్పీకర్ పాత్ర పరిసమాప్తమౌతుంది. లోక్‌సభలో నన్ను మాట్లాడకుండా అడ్డుకోవడం సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా.. ప్రతిపక్ష నేతగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించకుండా నన్ను కావాలనే అడ్డుకోవడం తీవ్ర అందోళనకరమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ, ఎప్పుడూ లేని పరిస్థితికి దారి తీసింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రోద్బలం మేరకు ప్రతిపక్ష నేతను మాట్లాడకుండా నిలువరించడం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. మన దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటిది ఈ పరిస్థితి. అందుకు నా నిరసనను వ్యక్తం చేస్తున్నాను. నిష్పక్షపాత చట్టసభ పరిరక్షకులుగా.. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పీకర్ ఓం బిర్లాకు గుర్తు చేస్తూ
ప్రతిపక్షాలతో సహా సభ్యులందరి హక్కులను కాపాడండి.’’ అంటూ లేఖలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు.