NTV Telugu Site icon

Rahul Gandhi: రాహల్ గాంధీకి ఖర్గే బెదిరింపులు.. ఎందుకో తెలుసా..?

Karge

Karge

పదేళ్ల తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్‌ తన ప్రతిపక్ష నేతను నియమించుకోనుంది. అందుకోసమని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అభ్యర్థించారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో.. సోమవారం కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా అంగీకరించకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను బెదిరించారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ విషయం రాహుల్ గాంధీ సరదాగా చెప్పారు. కాగా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Panchumarthi Anuradha: “పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే.”

నిజానికి.. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి తప్పుకుంటారని కాంగ్రెస్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయానాడ్ నుంచి పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. రాహుల్ గాంధీ పార్టీ సంప్రదాయ స్థానమైన రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగనున్నారు. కాగా.. రాహుల్ గాంధీ అంగీకరించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారని ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఇది మరింత చర్చించాల్సిన విషయమని చెప్పారు. అయితే ఇంతలో రాహుల్ గాంధీ నవ్వుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు తనను బెదిరించారన్నారు. దీంతో.. అక్కడున్న మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్ నవ్వారు.

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ.. ఓపెన్ అయిన కుమార్తె!

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పనితీరు కనబరిచినందుకు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్రెడిట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా నిర్ణయాన్ని పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సరదాగా అన్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు, మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని వర్కింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా సమాధానం ఇవ్వలేదు.