NTV Telugu Site icon

Sonia Gandhi: సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు దానిని భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బెంగళూరులో జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో పాల్గొన్న వీరిద్దరూ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.

Also Read: Monsoon Tips: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు తడిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ?

ఈ క్రమంలో విమానంలో సమస్య రావడంతో భోపాల్‌లో ల్యాండింగ్ చేసినట్లు సమాచారం అంతేకాకుండా ప్రతికూల వాతావరణం కూడా విమాన ప్రయాణానికి ఆటంకంగా మారడంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.