Rahul Gandhi: పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ-ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు..
- ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
- పేదలు ఇంగ్లీష్ నేర్చుకోవడం బీజేపీ-ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు
- వారు ఆంగ్లం నేర్చుకుంటే ప్రశ్నించే తత్వం పెరుగుతుంది
- సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని ఆరోపించారు. ఎందుకంటే.. వారు ఆంగ్లం నేర్చుకుంటే ప్రశ్నించే తత్వం పెరుగుతుందని అది బీజేపీ-ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదని విమర్శించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని.. విద్యార్థుల సాధికారతకు అది చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఆంగ్ల భాష అవసరం ఎంతో ఉందని.. మాతృ భాషతో పాటు ఆంగ్లం తప్పకుండా నేర్పాలని సూచించారు.
READ MORE: Srisailam: శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకులు.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి..
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
“ఇంగ్లీష్ ఆనకట్ట కాదు. ఇది ఒక వంతెన. ఇంగ్లీష్ సిగ్గు చేటు కాదు. అది అధికారం. ఇంగ్లీష్ ఒక గొలుసు కాదు.. ఇది గొలుసులను విచ్ఛిన్నం చేసే సాధనం” అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ పోస్టులో శీర్షిక పెట్టారు. అనంతరం పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. “బీజేపీ- ఆర్ఎస్ఎస్ లు భారతదేశంలోని పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే పేదలు ఈ భాష నేర్చుకుంటే.. వారికి ప్రశ్నించడం అలవాటు అవుతుంది. పేదలు ముందుకు సాగడం, సమానంగా నిలవాలని వాళ్లు కోరుకోరు. నేటి ప్రపంచంలో మీ మాతృ భాష ఎంత ముఖ్యమో.. ఇంగ్లీష్ అంతే ముఖ్యం. ఎందుకంటే ఇది ఉపాధిని అందిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భారతదేశంలోని ప్రతి భాషకూ ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉంటాయి. మనం వాటిని గౌరవించాలి. ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించాలి. ఇది మీ పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుంది.” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!