కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు.. కాళేశ్వరం కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిందని తెలిపారు. అంతేకాకుండా.. ధరణి పేరుతో వేల ఎకరాలు కేసీఆరే ఆక్రమించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో 8లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారు.. కేసీఆర్ గారూ.. మీరు వెళుతున్న రోడ్డు కాంగ్రెస్ వేసిందని రాహుల్ గాంధీ తెలిపారు. మీరు చదువుకున్న స్కూల్ నిర్మించింది కాంగ్రెస్ అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్… హైదరాబాద్ చుట్టూ భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయంటే అందుకు కారణం కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించి అమలు చేస్తామని తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తాం.. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. రైతులకు, కౌలు రైతులకు ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం.. రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తాం.. అధికారంలోకి రాగానే రైతులకు 24గంటల ఉచిత కరెంటు అందిస్తాం.. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.
Koti Deepotsavam LIVE : బిల్వార్చన, శ్రీశైలం మల్లికార్జున స్వామి కల్యాణం, భస్మ హారతి, జ్వాలా తోరణం
నిన్న సాయంత్రం నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. చదువుకునే యువతకు విద్యా భరోసా ద్వారా రూ.5లక్షలు సాయం అందిస్తామని చెప్పారు. ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అందుబాటులోకి తెస్తామని పేర్కొ్న్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండని రాహుల్ గాంధీ అక్కడి ప్రజలను కోరారు.