NTV Telugu Site icon

Sonia Gandhi and Rahul Gandhi: ఆక్సిజన్‌ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. భావోద్వేగానికి గురైన రాహుల్‌..

Sonia Gandhi

Sonia Gandhi

Sonia Gandhi and Rahul Gandhi: తనకు అమ్మ సోనియా గాంధీ అంటే ఎంత ప్రేమో.. పలు సందర్భాల్లో రాహుల్‌ గాంధీ తీసుకునే జాగ్రత్త చర్యలు ఇట్టే చెబుతుంటాయి.. అయితే, రాహుల్‌ గాంధీ తాజాగా, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సోనియా గాంధీ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ రాహుల్‌ ఎందుకు ఆ ఫొటో షేర్‌ చేశారనే విషయంలోకి వెళ్తే.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక సమావేశం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా.. సాంకేతిక లోపం కారణంగా, వారి చార్టర్డ్ విమానం భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. దీంతో విమానంలో ఆక్సిజన్‌ ​​కొరత ఏర్పడింది.. ఇక, రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో సోనియా గాంధీ ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ పోస్ట్ రాశారు.

సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ.” అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు. చార్టర్డ్ విమానంలో ఆక్సిజన్ కొరత ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఈ విమానంలో వెళ్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ఇద్దరూ భోపాల్ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో బస చేశారు. ఈ సందర్భంగా భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆయనను కలిశారు. దాదాపు గంటన్నర సేపు భోపాల్‌ ఎయిర్‌పోర్టులో బస చేసిన అనంతరం ఇద్దరూ రాత్రి 9.35 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

నివేదిక ప్రకారం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు నుండి ఢిల్లీకి వెళ్తున్న ప్రైవేట్ జెట్‌లో.. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించాడు. ఆ తర్వాత, ముందుజాగ్రత్తగా, భోపాల్ ATC ల్యాండింగ్ గురించి మాట్లాడింది. అనుమతి లభించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. కాగా, మంగళవారం బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక రెండో రోజు సమావేశం ముగిసింది.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. ఈ సమావేశంలో విపక్షాల కూటమి పేరును INDIAగా ఖరారు చేశారు. ఇది ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌ గా పేర్కొన్న విషయం విదితమే.