Site icon NTV Telugu

Rahul Gandhi: డానిష్ అలీని కలిసిన రాహుల్ గాంధీ.. కౌగిలించుకునే ఫొటో పోస్ట్

Danish Ali

Danish Ali

లోక్‌సభ ప్రత్యేక సమావేశాల చివరి రోజున బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి కించపరిచే పదజాలం వాడిన అంశం ఊపందుకుంది. ఈ విషయంపై రాజకీయ ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. డానిష్ అలీ ఇంటికి చేరుకున్న రాహుల్ గాంధీ.. అతన్ని కౌగిలించుకుని చాలాసేపు మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పంచుకున్నారు. అంతేకాకుండా ఆ ఫొటోను పోస్ట్ చేసి “ద్వేషం మార్కెట్‌లో ప్రేమ దుకాణం” అని రాశారు. రాహుల్ గాంధీని కలిసిన అనంతరం బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ మాట్లాడుతూ.. తన నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు, మద్దతునిచ్చేందుకు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని తెలిపారు. తాను ఒంటరివాడిని కాదని.. ప్రజాస్వామ్యానికి ధీటుగా నిలబడే వారందరూ తన వెంటే ఉన్నారని అన్నారు.

Read Also: Manchu Manoj: ర్యాంప్ ఆడిద్దాం అంటున్న మంచు మనోజ్..

మరోవైపు రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. అతని సిగ్గుమాలిన, చిల్లర చర్య సభ గౌరవానికి మచ్చ అని పేర్కొంది. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇటువంటి ద్వేషం, ద్వేషపూరిత మనస్తత్వానికి దేశంతో పాటు కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపింది. గురువారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రమేశ్ బిధూరి ప్రకటనను ఖండించిన ప్రతిపక్షాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాయి. మరోవైపు రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా.. రమేష్ బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.

Exit mobile version