కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎంతోమంది స్వప్నం తెలంగాణ… సోనియాగాంధీ సాకారం చేశారన్నారు. కానీ ఎందరో స్వప్నం ఒక్క కుటుంబానికి లబ్ది చేకూర్చిందన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంభకోణం తో మునిగిపోయిందన్నారు. ప్రాజెక్ట్ నీ నేను స్వయంగా చూసానని, మీ భూమి నీ మీ దగ్గర నుంచి లాగేసుకున్నారన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతుంది… కెసిఆర్ జి మీరు చదువుకున్న స్కూల్, కాలేజి, యూనివర్సిటీ కాంగ్రెస్ నిర్మించిందన్నారు రాహుల్ గాంధీ. మేము తెలంగాణ ప్రజలకు 6 వాగ్దానాలు చేస్తున్నామని, వంట Gas నీ మీరు ఇప్పుడు 1200 కి కొంటున్నారు… మేము అధికారంలోకి రాగానే గ్యాస్ 500 కే ఇవ్వబోతున్నమన్నారు రాహుల్ గాంధీ.
అంతేకాకుండా.. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బస్ లో ఎక్కడికి ప్రయాణం చేయాలంటే ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం.. ప్రతి మహిళ అకౌంట్ లో 2 వేల రూపాయలు… రైతుల అకౌంట్ లో ప్రతి ఏటా 15 వేల రూపాయల వేస్తాము.. సోదరీమణులు బస్ లో ఉచిత ప్రయాణం.. రైతులకు ఉచిత కరెంట్.. గృహ జ్యోతి లో భాగంగా 2500.. యువ వికాసం లో విద్యార్థులకు విద్యా బరోసా 5లక్షల రూపాయలు.. ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలానికి ఒక్కటి.. వృద్దులకు నెలకు 4వేల రూపాయలు.. బీఆర్‌ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కొందరికే లాభం చేకూరే లా చేస్తోంది.. ఉన్నత వర్గాలకు మాత్రమే ఖర్చు చేస్తోంది… అదే డబ్బు పేదవారి కి నేరుగా బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము..
ఇది ప్రారంభం మాత్రమే…. ఇప్పటికే తమ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించాము… మేము అధికారంలోకి రాగానే కుల జనగణన చేస్తాము… దేశంలో అన్ని కులాల గణన చేస్తాము… బడ్జెట్ లో కేటాయింపులు కూడా అదే విధంగా పంపకాలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం… పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అనేక మార్పులు వస్తాయి. దేశవ్యాప్తంగా జోడో యాత్ర తిరిగాను… అనేక సమస్యలు గుర్తించాను.. ఇది విద్వేషాలు పెంచే దేశంకాదు… ప్రేమ ను పంచే దేశం.. .కాంగ్రెస్ పార్టీ నినాదం… విద్వేషాలు ఉన్నచోట కూడా ప్రేమ ను నాటుతం… బీజేపీ, బీఆర్‌ఎస్ తో మా పోరాటం ఉంటుంది… ఒకరు Delhi లో పని చేస్తున్నారు… ఒకరు తెలంగాణ లో పనిచేస్తున్నారు… చాలా తక్కువ వ్యవది లోనే వారి గాలి మొత్తం కాంగ్రెస్ తీసేసింది… బీజేపీ గాలి మొత్తం తేసేసాను… కానీ వారే బీఆర్‌ఎస్ కోసం పనిచేస్తున్నారు.’ అని రాహుల్ గాంధీ అన్నారు.