Site icon NTV Telugu

Himanta Biswa Sharma: నా ముందు నిలబడే ధైర్యం రాహుల్ గాంధీకి లేదు.. అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు

Assam Cm

Assam Cm

బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఎదురుదాడి చేశారు. హిమంత బిస్వా శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రేమ మాత్రమే ఉంది, ద్వేషం లేదు, ప్రేమ దుకాణం వంటి పదాలు తమ నిఘంటువులో లేవన్నారు. ఈ ప్రేమ దుకాణం ఓట్ల కోసం మాత్రమేనని విమర్శించారు. ఎవరికైనా దుకాణం ఉంటే అది లాభం కోసం.. మీరు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు దుకాణం ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నించారు.

Read Also: Uttar Pradesh: 15 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 3 నెలల పాటు అత్యాచారం

ఇంతకుముందు రాహుల్ గాంధీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. ఆ తరువాత వారు కౌగలించుకున్న ‘X’ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. క్యాప్షన్ లో “ద్వేషం యొక్క మార్కెట్‌లో ప్రేమ దుకాణం” అని రాశాడు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా అస్సాం సీఎం రీ కౌంటర్ ఇచ్చారు. మీరు కేవలం ప్రేమ గురించి మాట్లాడితే అది అర్ధం అవుతుంది.. కానీ దానిలో దుకాణం వస్తోంది అంటే అది లాభదాయకం, ఈ లాభం ఓట్ల కోసం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఈ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన కాన్‌క్లేవ్ 2023లో హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తన ముందు నిలబడే ధైర్యం లేదన్నారు. అతను ఎప్పుడూ భారతదేశ ప్రజలను తక్కువగా అంచనా వేస్తాడని.. భారతీయులు రాజకీయంగా పరిణతి చెందినవారు, మరింత సున్నితంగా ఉంటారని తెలిపారు.
రమేష్ బిధూరిపై హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని.. పార్టీ నోటీసు జారీ చేసింది, చర్య తీసుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని గురించి మాట్లాడారు.

Exit mobile version