Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలపై పోలీసుల లాఠీఛార్జ్‌ను కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు ఝళిపించడం ఎంతమాత్రం సరైంది కాదని, ఇది పూర్తిగా ‘భారతీయ సంస్కృతికి వ్యతిరేకం’ అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ అంశంపై ప్రధాని మోదీ ఇప్పటివరకు నోరు విప్పకపోవడం దారుణమని నిలదీశారు.
ఈ ఘటనపై పార్లమెంట్లో చర్చ జరపాలంటూ ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. అయితే సభలో చర్చ చేపట్టాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ తమతో అన్నారని రాహుల్ వెల్లడించారు. ప్రజాసమస్యలపై పార్లమెంట్లో చర్చించడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడం విచారకరమని ఆయన విమర్శించారు. దేశంలో విద్యా, పరీక్షల వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని, లీకేజీలతో వ్యవస్థ లోపలి నుంచి గుల్లయిందని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించి విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాల్సింది పోయి, విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షాలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. అలాగే హోంమంత్రికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
తాజావార్తలు
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!