పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న బస్సుయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం అని వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతీ మహిళకు రూ.2500 అందిస్తాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. భూమి లేని రైతు కూలీలకు 12వేలు, రైతులకు, కౌలు రైతులకు 15వేలు అందిస్తాం.. గృహలక్ష్మీ ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి.. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అవి బీఆర్ఎస్ కు వేసినట్టే.. బీజేపీపై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు.. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Tamannah Bhatia :మరోసారి రెచ్చిపోయిన మిల్క్ బ్యూటి.. రెడ్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్..
కానీ లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు.. సీబీఐ, ఈడీ కేసులు లేవు అని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి.. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతోంది.. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. దేశంలో కులగణన చేపట్టాలి.. అది దేశానికి ఎక్స్ రే లాంటిది.. ఓబీసీ గురించి మాట్లాడే ప్రధాని ఎందుకు కులగణన చేపట్టడం లేదు? అని ఆయన రాహుల్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టపోతాం అని సోనియాగాంధీకి తెలుసు.. కానీ రైతులు.. పేదల కోసం తెలంగాణ ఏర్పాటు చేసింది అని ఆయన అన్నారు. పదేళ్ల తర్వాత కూడా సోనియాగాంధీ కళ నెరవేరలేదు.. అందుకే.. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధమే ఈ ఎన్నికలు అని రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Bhagavanth kesari: జై బాలయ్య అంటూ థియేటర్లో రచ్చ చేసిన మెగా డైరెక్టర్
కేసీఆర్ కుటుంబం ప్రభుత్వంలోని కీలక శాఖలు తన అధీనంలో పెట్టుకున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేసీఆర్.. ముఖ్యమంత్రిగా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు.. మీ భూములు లాక్కున్నారు.. కాళేశ్వరం నుంచి మీకు లాభం జరిగింది.. ధరణితో ఎవరికి లాభం అని ఆయన ప్రశ్నించారు. ధరణిలో భూముల రికార్డు మార్చారు.. పేదల భూములు లాక్కున్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఎంత మందికి వచ్చింది.. లక్ష మాఫీ ఎంత మందికి అయ్యింది అని రాహుల్ అడిగారు. సింగరేణి కార్మికులతో మాట్లాడినా.. సింగరేణి ప్రైవేటీకరణ కానివ్వాం.. ఆదానికి అమ్మే ప్రయత్నాలు జరుగాయి.. దాన్ని మేమే అడ్డుకున్నాం అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Read Also: Mahsa Amini: ఇరాన్ యువతి మహ్స అమినికి ఈయూ ప్రతిష్టాత్మక అవార్డ్..
సింగరేణికి రక్షణగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. దేశంలో మోడీ.. అదానికి సాయం చేస్తున్నారు.. ప్రభుత్వ కంపనీలకు ఒక ధర.. ప్రైవేట్ కంపనీలకు ఇంకో ధర నిర్ణయిస్తున్నారు.. మోడీ 15 లక్షలు మీ అకౌంట్ లో వేస్తా అన్నారు ఇవ్వలేదు.. కేసీఆర్ మూడెకరాల భూమి దళితులకు ఇస్తాం అన్నారు ఇవ్వలేదు.. నేను అబద్ధం చెప్పను.. ఏం హామీలు ఇచ్చామో.. కర్ణాటక.. రాజస్థాన్ లో అమలు చేశాం.. కర్ణాటకలో ఏ మహిళను అయినా అడగండి.. ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు.. తెలంగాణలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని రాహుల్ గాంధీ అన్నారు.