NTV Telugu Site icon

Raghunandan Rao: సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంది

Raghunandan Rao

Raghunandan Rao

బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ఫైర్ అయ్యారు. సిద్దపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని దోచుకుంటుందని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారని అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ ముందు “నయవంచన” అని రాసిన బోర్డు పెట్టుని ధర్నా చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారన్నారు. దేశంలో నయవంచన అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మెజార్టీ ప్రజలను వంచించిందని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చా.. దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలను తెచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలైనా.. ఇంత వరకు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని అడిగారు.

READ MORE: World Record: వామ్మో.. ఒక్కపరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు పడగొట్టిన బౌలర్..

జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు మర్చలేదని అసెంబ్లీలో కొట్లాడానని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. వెంట్రామిరెడ్డి పేద ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. బీజేపీ పార్టీకి కార్యకర్తలే బలం.. వాళ్లే శ్వాస, ధ్యాస.. అన్నారు. ఇంత ఎండలో వేరే పార్టీ నాయకులు మీడింగ్ పెడితే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తాయన్నారు. నాటి నరేంద్రుడి కలను ప్రధాని మోదీ నెరవేరని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన మన దేశం గురించి గొప్పగా చెప్పుకునే విధంగా మోదీ చేశారన్నారు. ఇదే నియోజకవర్గంలో 1995లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 19 వేల ఓట్లు సాధించిందని చెప్పారు. నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ.. కాషాయ జెండాను విడిచి పెట్టమని లేదంటే చంపేస్తామని బెదిరించినప్పటికీ వదలలేదని గుర్తుచేశారు. సిద్దిపేట గడ్డ కాషాయానికి అడ్డ అన్నారు. దేశంలో మోదీని మరోసారి గెలిపిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.