Raghav Chadha: గ్రాముల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.. గంటల ఆలస్యానికి పరిహారం ఇవ్వరా..? విమాన సంస్థల తీరుపై ఫైర్..!
- రాఘవ్ చద్దా విమానయాన సంస్థలపై ఘాటు విమర్శలు
- అదనపు లగేజీపై కఠినంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఆరోపణ
- విమానాల ఆలస్యం, రద్దుపై ప్రయాణికులకు పరిహారం లేకపోవడంపై ఆగ్రహం
- గ్రాముల లెక్కన ఛార్జీలు.. కానీ గంటల ఆలస్యానికి బాధ్యత ఎందుకు లేదని ప్రశ్న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ ‘రాఘవ్ చద్దా’ విమానయాన సంస్థల ఏకపక్ష ధోరణిపై ఘాటుగా స్పందించారు. ప్రజల సమ్యసలపై ప్రశ్నించే ఆయన ఈసారి విమానయాన సంస్థల వైఖరిపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థలు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని ఆయన విమర్శించారు.
Donald Trump: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్!
Also Read
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
- Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ప్రజల వద్ద ఉన్న అదనపు లగేజీ విషయంలో కఠినంగా వ్యవహరించే కంపెనీలు, విమానాల ఆలస్యం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు మాత్రం బాధ్యత వహించడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయమై రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ.. ఓ ఆసక్తికరమైన పోలికను లేవనెత్తారు. “ప్రయాణికులు కేవలం ఒక కేజీ అదనపు లగేజీ తీసుకెళ్తే విమాన సంస్థలు భారీగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. లగేజీని గ్రాములతో సహా లెక్కించే సంస్థలు, ప్రయాణికుల విలువైన సమయాన్ని గంటల లెక్కన ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు?” అంటూ మంది పడ్డారు. విమానాలు గంటల తరబడి ఆలస్యమైనా లేదా రద్దయినా ప్రయాణికులకు తగిన పరిహారం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విమానయాన రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని చద్దా డిమాండ్ చేశారు. మీరు గ్రాముల లెక్కన ఛార్జీలు వసూలు చేస్తున్నప్పుడు, విమానం ఆలస్యమైన ప్రతి గంటకు ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉందని స్పష్టం చేశారు. విమానాల ఆలస్యం, రద్దు వల్ల ఇబ్బంది పడే సామాన్య ప్రయాణికులకు నేరుగా పరిహారం అందేలా ఒక బలమైన వ్యవస్థను రూపొందించాలని ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు.
తన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియా వేదిక ‘X’ లో పంచుకున్నారు. “ఒక కేజీ అదనపు లగేజీ ఉంటే విమాన సంస్థలు భారీ బిల్లు వేస్తాయి, కానీ 4 గంటల విమానం ఆలస్యమైతే మాత్రం మీకు ఏమీ చెల్లించవు” అంటూ ఆయన చేసిన పోస్ట్ నెటిజన్ల నుండి భారీగా స్పందన అందుకుంటుంది. విమాన ప్రయాణాల్లో తరచూ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులు చద్దా వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ తమ మద్దతును తెలుపుతున్నారు.
1 extra kg of baggage and airline bills you exorbitantly. But 4 hours of flight delay and airline owes you nothing.
Airlines track your baggage weight to the gram. Why don’t they value your time to the hour?
If they can charge you by the gram, they must compensate you by the… pic.twitter.com/Prn7NRSKhL
— Raghav Chadha (@raghav_chadha) March 30, 2026
తాజావార్తలు
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
-
Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
-
Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!