Ravindra Jadeja: గుండెలు పిండేసే దృశ్యం.. CSK ఫ్యాన్స్ నినాదాలకు కన్నీళ్లు పెట్టుకున్న జడేజా(వీడియో)..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఈ ముగ్గురు సీఎస్‌కేలో ఎంత ఉత్సాహంగా ఉండే వాళ్లో చెప్పనవసరం లేదు. అయితే.. రైనా టీ20 కేరీర్‌కి గుడ్ బై చెప్పగా.. ధోనీ, జడేజా వేర్వేరు టీమ్‌లలో ఆడుతున్నారు. ధోనీ ఇప్పటికీ సీఎస్‌కేను విడవలేదు. గత 12 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో అంతర్భాగంగా ఉన్న రవీంద్ర జడేజా, ఈ ఏడాది మళ్ళీ తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున బరిలోకి దిగాడు. దీంతో అభిమానులకు కొంత ఆశ్చర్యాన్ని, మరికొంత భావోద్వేగాన్ని కలిగించింది. ఇక సోమవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్‌లో జడేజా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన మాజీ జట్టు కష్టాల్లో ఉండటం చూసి జడేజా ఎమోషనల్ అయ్యాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
READ MORE:CSK-MS Dhoni: ‘ధోని’ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గెలవలేదా..? ఆయన లేని లోటు స్పష్టంగా..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
వాస్తవానికి.. 19వ సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ ఒప్పందం జరిగింది. ఇందులో రవీంద్ర జడేజా, సంజు శామ్సన్‌లను ఇరు జట్లు పరస్పరం మార్చుకున్నాయి. ఈ ట్రేడ్ తర్వాత ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో సీఎస్‌కే అభిమానుల ప్రేమను చూసి జడేజా భావోద్వేగానికి గురవడం కనిపించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి చెన్నై జట్టుకు పెద్ద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత, తుపాకీ పేలుస్తున్నట్లుగా జడేజా చేసిన విలక్షణమైన సంబరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దుబేల కీలక వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో జడేజా మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత జడ్డూ బౌండరీ సమీపంలో ఫీల్డింగ్‌కు వెళ్లగానే, సీఎస్‌కే అభిమానులు ‘జడ్డూ జడ్డూ’ అని నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అభిమానుల ప్రేమకు ముగ్ధుడైన జడ్డూ భావోద్వేగానికి లోనయ్యాడు. అతని భావోద్వేగభరితమైన ఫోటో, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెర్సీ మార్చిన తర్వాత కూడా జడ్డూపై చెన్నై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ‘జడ్డూ-జడ్డూ’ నినాదాలు విన్న రవీంద్ర జడేజా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు.
READ MORE: Marco Rubio-Iran: ‘‘మా కంటే వారికే ఎక్కువ నష్టం’’.. హార్ముజ్‌పై మార్కో రూబియో హెచ్చరిక
Jadeja was literally crying near boundary 😭😭
Players will come and go but jaddu will forever be our thalapathy 💛💛
Even after CSK traded him he still holds that emotional bond for themsir jadeja you are a gem of a human being 🙏🏻🙏🏻🥺 pic.twitter.com/HsQAgvL5mq
— DB (@Brevisnation7) March 30, 2026
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!