Donald Trump: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు వారాలు గడిచింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో పరిస్థితి రోజు రోజుకూ మరింత దిగజారుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury)ను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయకులకు చెప్పినట్లు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ “ది వాల్ స్ట్రీట్ జర్నల్” నివేదించింది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పూర్తిగా తెరుచుకోకపోయినా యుద్ధానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వార్త ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్ కలిగించనుంది.
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ఇక యుద్ ప్రారంభంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు వారాల్లోపు యుద్ధం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. ఆ తరువాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో యుద్ధం ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది యుద్ధ కాలాన్ని మరింత పొడిగిస్తుందని తాజాగా ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ఆ జలసంధిని ఇరాన్ నియంత్రణలోనే వదిలేసి, తన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ దౌత్యపరంగా ఆ మార్గం తెరుచుకోకపోతే, యూరప్ మరియు గల్ఫ్ దేశాల సహాయంతో తర్వాత చర్యలు తీసుకోవచ్చని ఆయన యోచిస్తున్నారు. మంగళవారం జరిగిన వైట్ హౌస్ బ్రీఫింగ్‌లో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. చమురు ట్యాంకర్ల సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించడం అనేది యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ నిర్దేశించుకున్న ‘ప్రధాన లక్ష్యాల్లో’ ఒకటి కాదని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.
READ MORE: Ravindra Jadeja: గుండెలు పిండేసే దృశ్యం.. CSK ఫ్యాన్స్ నినాదాలకు కన్నీళ్లు పెట్టుకున్న జడేజా..
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!