Siva Prasad Reddy: ఏడాది పాలనలో వెన్నుపోటు, మోసం, కుట్రలు తప్ప ఏం లేవు.. మాజీ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siva Prasad Reddy: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై విసుగుతో ఉన్నారని, మాటలతో మోసగిస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాప్తాడు సిద్ధం సభకు వచ్చిన ప్రజల సంఖ్యను చూసిన తర్వాత కూడా కొందరు టీడీపీ మహానాడు సమావేశంతో పోల్చడం హాస్యాస్పదం. మేము నిర్వహించిన సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. కానీ టీడీపీ మహానాడుకు మాత్రం బయటపెట్టి, బెదిరించి తరలించారు. ఇది ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు.
Read Also: IPL 2025:’ఆర్‌సిబి గెలవకపోతే.. నేను నా భర్తకు విడాకులిస్తా’.. పోస్టర్ వైరల్
Also Read
ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అయినా అమలు చేసిందా అని నిలదీశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ? ఏ పథకం అమలు చేశారు? చూపించగలరా? అని రాచమల్లు ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. మోసం, కుట్రలు, వెన్నుపోట్లతో పాలనను నడిపించారని ఆయన మండిపడ్డారు. విద్యుత్, RTC, నీటి బిల్లులతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Virat Kohli: నీళ్లు అందిస్తాడు అంటూ.. యువ ఆటగాడిపై విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్!
ప్రభుత్వం చేసిన అన్యాయాలను తెలిపేలా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినందుకు ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. మా పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇదే నిజమైన మద్దతు. స్వేచ్ఛగా వచ్చిన జనమే మా బలం అని ఆయన అన్నారు. ముఖ్యంగా, కడపను టీడీపీ గడ్డగా ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. ఒక్కసారి మహానాడు నిర్వహించారన్న కారణంతో కడపను టీడీపీ అడ్డా అనడం వింతగా ఉంది. ప్రజల మద్దతుతోనే ఎవరు బలంగా ఉన్నారో త్వరలో అందరికీ తెలుస్తుంది అని అన్నారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!