PV Sindhu: యుద్ధం ఎఫెక్ట్.. రణరంగంగా మారిన గల్ఫ్.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న స్టార్ షట్లర్ పివి సింధు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య మొదలైన భీకర పోరు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. శనివారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విచక్షణారహితంగా దాడులు ప్రారంభించగా, ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల మధ్య విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. వారిలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
మూతపడ్డ దుబాయ్ ఎయిర్పోర్ట్..
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం యుద్ధం కారణంగా హఠాత్తుగా మూతపడింది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పైకి కూడా క్షిపణులు దూసుకొచ్చాయి. అయితే, యూఏఈ సైన్యం వీటిని గాలిలోనే అడ్డుకుని నాశనం చేసింది. భద్రతా కారణ దృష్ట్యా విమాన సర్వీసులను నిలిపివేయడంతో ఎయిర్పోర్ట్ జనంతో కిక్కిరిసిపోయింది.
UK టోర్నమెంట్‌కు వెళ్తూ చిక్కుకున్న సింధు..
ప్రతిష్టాత్మకమైన ‘ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్’లో పాల్గొనేందుకు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న పివి సింధు, తన బృందంతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. బ్రిటన్‌కు వెళ్లే క్రమంలో దుబాయ్‌లో విమానం మారాల్సి ఉండగా, ఈ లోపే యుద్ధం ముదరడంతో ఆమె అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. విమానాశ్రయం వెలుపల క్షిపణుల పేలుళ్లు, యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుండటం, అమెరికా – ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడంతో గల్ఫ్ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన పివి సింధు, ఆమె బృందం క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
The ordeal continues to unfold, and the situation is becoming more frightening by the hour.
A few hours ago, there was an explosion close to where we were holed up at the airport. My coach had to quickly run out of the area as he was closest to the smoke and debris. It was an… https://t.co/ZdNtuALk0P
— Pvsindhu (@Pvsindhu1) March 1, 2026
READ ALSO: Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!