Site icon NTV Telugu

Vladimir Putin: ఇంట్లో మెట్లపై నుంచి పడిపోయిన పుతిన్‌

Vladimir Putin

Vladimir Putin

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. 70 ఏళ్ల పుతిన్‌ మెట్లపై నుంచి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆయన బాడీగార్డ్స్‌ సోఫాలో కూర్చోబెట్టగా వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాల అధినేతల్లో బలమైన నేతగా వెలుగొందుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పడిపోయినట్లు జనరల్ ఎస్‭వీఆర్ అనే రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ పేర్కొంది. వాస్తవానికి ఈ ఛానల్ పుతిన్‭పై తరుచూ విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆ విషయాన్ని క్రెమ్లిన్ బయటపెట్టడం లేదని నిరంతరం చెప్తూ ఉంటుంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనారోగ్య సమస్యలతో సమతమతవుతున్నట్లు వెల్లడిస్తూ వస్తున్న జనరల్‌ ఎస్‌వీఆర్‌ తాజా పరిణామం గురించి వెల్లడించింది. అయితే, ఈ విషయంపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. మెట్లపై నుంచి పడిపోవడం వల్ల తుంటి ఎముక దెబ్బతినంటతో పాటు జీర్ణాశయాంతర క్యాన్సర్‌ బయటపడిందని మీడియా పేర్కొంది. ‘సమీపంలోని సోఫాలోకి తీసుకెళ్లేందుకు ముగ్గురు సెక్యూరిటీ అధికారులు పుతిన్‌కు సాయం చేశారు. అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను పిలిపించారు. పుతిన్‌ ఇప్పటికే జీర్ణాశయాంతర పేగు ఆంకాలజీతో బాధపడుతున్నారు. దాని ఫలితంగా ఆయన ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే మెట్లపై నుంచి పడిపోయారు.’ అని స్థానిక మీడియా పేర్కొంది. 

Constable Exam Paper Leak: కానిస్టేబుల్‌ పరీక్ష పేపర్‌ లీక్‌.. విచారణ చేపట్టిన సీబీఐ

గాయం కారణంగా పుతిన్ బాత్‌రూంకు కూడా ఒంటరిగా వెళ్లలేకపోయారని టెలిగ్రామ్ ఛానల్‌ పేర్కొంది. పుతిన్‌ మెట్లపై నుంచి పడిపోయిన క్రమంలో ఆయన ఆరోగ్యంపై మరోమారు వార్తలు గుప్పుమన్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, దగ్గు, మైకము, నిద్రలేమి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని పలు మీడియాలు కథనాలు వెల్లడించాయి. పుతిన్‌ తన చుట్టూ క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లు నిత్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారని గతంలోనూ పలు మీడియాలు పేర్కొన్నాయి.

Exit mobile version