గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఫ్యాన్స్‌ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదనే పట్టుదలతో వరుసగా భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, దీని తర్వాత సుకుమార్-చరణ్ కాంబోలో రాబోయే సినిమా (RC17) ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ ‘పుష్ప 3’ని మొదలుపెడతారని, ఆ తర్వాతే చరణ్ సినిమా ఉంటుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావించారు.అయితే తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Champion : ‘నాన్న పేరు నిలబెట్టాలి’ – రోషన్ ఎమోషనల్ స్పీచ్
సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్‌తోనే చేయబోతున్నారని, ‘పుష్ప 3’ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఈ మెగా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వార్త విన్న మెగా అభిమానులు పండగ చేసుకుంటుండగా, పుష్పరాజ్ రాక కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి రావడంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.