ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది..ఇదిలా ఉంటే ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా, తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ ఒప్పందం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది..
‘పుష్ప 2’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తాజాగా సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఈ ఓటీటీ సంస్థ కు భారీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ముందుగా పుష్ప 2 హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఎంతగానో పోటీ పడింది. అయితే, ఈ సీక్వెల్ రైట్స్ కోసం మేకర్స్ భారీగా డిమాండ్ చేయటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వెనక్కి తగ్గింది.. దీనితో నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం.2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకుంది. తాజాగా సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ మూవీ డిజిటల్ హక్కులను అంతకంటే మూడు రెట్లు అధికంగా చెల్లించి నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది… సుమారు రూ.100కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్టు సమాచారం.. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.