NTV Telugu Site icon

Puspa 2 Collections: తగ్గేదేలే.. 10 రోజుల్లో పుష్పరాజ్ ఎంత కొల్లగొట్టాడంటే

Puspa 2

Puspa 2

Puspa 2 10 Days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..

సినిమా విడుదల కాకముందు నుంచే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇకపోతే, పుష్ప 2 చిత్రం విడుదలై 10 రోజుల్లో రూ. 1292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరింది. చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, అనసూయ తదితరులు నటించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. సినిమా విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు బ్రేక్ చేసింది. ఈ సందర్భంగా పుష్ప 2 కలెక్షన్స్ వివరాలను తెలిపే స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Show comments