Site icon NTV Telugu

TDP-Jana Sena-BJP Alliance: ఏపీకి తిరిగివచ్చిన పురంధేశ్వరి.. ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్‌..

Alliance

Alliance

TDP-Jana Sena-BJP Alliance: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. కలిసి పోటీ చేయాలని డిసైడ్‌ అయిన టీడీపీ-జనసేన ఇప్పటికే తొలి జాబితాను కూడా ప్రకటించాయి.. అయితే, ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు.. దీనిపై ఈ రోజు ఫైనల్‌ చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఓ దఫా చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్.. ఈ రోజు అమిత్‌షాతో మరోసారి చర్చలు జరిపేందుకు ఢిల్లీలోనే మకాం వేశారు.. శుక్రవారం రోజు ఢిల్లీ వేదికగా మూడు పార్టీల నేతల సమావేశం జరగాల్సి ఉండగా.. అది ఈ రోజుకు వాయిగా పడింది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బిజీ షెడ్యూల్‌ కారణంగా మీటింగ్‌ పోస్ట్‌పోయిన్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ రోజు మూడు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు.. ఉదయం 11 గంటలకు పాట్నా పర్యటనకు వెళ్లనున్నారు అమిత్‌షా.. ఆలోగా ఈ సమావేశం జరగనుంది..

Read Also: Gaza : గాజాలో విషాదం.. ఆహార ప్యాకెట్లు మీద పడి ఐదుగురి మృతి.. పలువురికి గాయాలు

అయితే, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కంటే ముందుగానే ఢిల్లీ వెళ్లిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపారు.. బీజేపీకి ఏ స్థానాల్లో ఎంత బలం ఉంది..? ఏఏ స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది..? ఎన్ని పార్టమెంట్‌ స్థానాల్లో పోటీ చేద్దాం..? ఏఏ అసెంబ్లీ సీట్లు అయితే బెటర్‌ అనే వివరాలను బీజేపీ పెద్దలకు అందజేశారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ నేతలతోనూ బీజేపీ జాతీయ నాయకులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మరోవైపు.. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి వచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు.. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న పురంధేశ్వరి.. సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో రెండు రోజుల పాటు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. అయితే, పొత్తులు, సీట్ల వ్యవహారం తేల్చాంది మొత్తం బీజేపీ అగ్రనేతల కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో.. ఆమె రాష్ట్రానికి తిరిగి వచ్చారు.. కానీ, టీడీపీ, జనసేన అగ్రనేతలు మాత్రం ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు పొత్తులపై ఫైనల్‌గా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Exit mobile version