Purandeshwari Speech in BJP State Leaders Meeting: విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారన్నారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందని పురంధేశ్వరి అన్నారు.
Also Read: Minister Talasani: రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర
ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉందని.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. రాజకీయంగా వేసే అడుగుల పైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని.. మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందన్నారు. సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తోన్న పరిస్థితి ఉందన్నారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి అన్నారు.. కానీ అలా జరగడం లేదన్నారు.
Also Read: Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?
వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారు.. వారిని కలుపుకుని ఉపాధి కల్పించామనే లెక్కలు వేసి చెబుతున్నారన్నారు. పెట్టుబడులు రావడం లేదని.. వచ్చిన పరిశ్రమలు ఉండడం లేదన్నారు. లూలూ, జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని ఆరోపణలు చేశారు. ఇసుక దందా భారీ ఎత్తున జరుగుతోందన్నారు. సుప్రీం కోర్టు కూడా ఇసుక తవ్వకాలు ఆపాలని ఆదేశించిందని.. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమన్నారు. ఇసుక మాఫియా వల్ల పేదల జీవితాలు రోడ్డున పడ్డారని.. భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో నేతలు జేబులు నింపుకోవడమే కాదు.. పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయన్నారు. ప్రజల సమస్యలపై పోరాడితేనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని బీజేపీ నేతలకు పురంధేశ్వరి సూచించారు. సర్పంచులు పార్టీలకతీతంగా దారి మళ్లిన నిధుల కోసం ఆందోళన చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యల వలయమేనని ఆరోపణలు చేశారు. కేంద్రం ఏపీకి అనేక రకాలుగా సహకారం అందిస్తోందన్నారు. కేంద్రం నుంచే వచ్చే డెవల్యూషన్ ఫండ్స్ గతానికంటే చాలా ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇళ్లకు రంగులు మార్చడంపై ఉన్న శ్రద్ధ.. ఇళ్ల నిర్మాణంపై చెప్పడం లేదన్నారు. కేంద్ర నిధులను పక్క దోవ పట్టిస్తోందన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందన్నారు.
Also Read: ADR Report: దేశంలో 44 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే.. ఏడీఆర్ నివేదికలో కీలక విషయాలు!
బీజేపీ ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ అన్న పురంధేశ్వరి.. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని చెప్పామని.. ఇప్పుడదే చేస్తున్నామన్నారు. ఓట్ల కోసం రాజకీయం చేయనని మోడీ చెప్పారన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని మోడీని బాస్ అన్నారన్నారు. పపువా న్యూగినియా ప్రధాని మన ప్రధాని కాళ్లకు మొక్కారన్నారు. ఒకప్పుడు మా దేశమే రావద్దన్న అమెరికా ఇప్పుడు నరేంద్ర మోడీకి ఎర్ర తివాచి పరిచిందన్నారు. ప్రపంచాన్ని విశ్వగురు స్థానంలో నిలిపిన మోడీ మనకు ప్రధానిగా ఉండడం మన అదృష్టమన్నారు.