విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు.