SRH vs PBKS: ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. బ్యాక్-టు-బ్యాక్ ఓటములను చవిచూసిన సన్‌రైజర్స్ జట్టు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్‌పై జట్టుపై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. సన్‌రైజర్స్ సేన టాస్ గెలిచి తొలుత బౌలింగ్‌ను ఎంచుకోగా.. హైదరాబాద్ బౌలర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేయగలిగింది ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్(33), షారుక్‌ఖాన్ (4) ఉన్నారు.

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్కు మంచి ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే ప్రబ్‌సిమ్రన్ సింగ్ భువనేశ్వర్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో షార్ట్ ఒక్క పరుగు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. మార్కో జాన్సెన్ వేసిన నాలుగో ఓవర్లో జితేష్ శర్మ ఔటయ్యాడు. సామ్ కరన్(22) రూపంలో పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన సామ్ కరన్ భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పంజాబ్ కింగ్స్ కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ సికిందర్ రజా(5) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. బౌండరీ వద్ద మయాంక్ అగర్వాల్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు.