Wife Killed Husband : మహాతల్లి.. మొగుడిని వాకింగ్‌కని తీసుకెళ్లి వాచేటట్టు కొట్టి చంపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Killed Husband : కొత్తగా పెళ్లయింది.. సరదాగా కొన్ని రోజులు గడుపుదామని అత్తమామల వద్దకు వచ్చిన అల్లుడిని గుర్తు తెలియని నిందితులు హత్య చేశారు. ఈ ఘటన పుణెలోని మావల్‌లోని గహుంజేలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్యాకాండ ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది. హత్యపై విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో తేలిన విషయాలు విని షాక్ తిన్నారు. పదే పదే శారీరకంగా హింసించడం, కొట్టడంతో విసిగి వేసారిన భార్యే భర్తను హత్య చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. విచారణ అనంతరం పింప్రి-చించ్‌వాడ్ పోలీసులు మీడియాకు ఈ సమాచారం ఇచ్చారు. ఈ కేసులో హత్యకు గురైన సూరజ్ భార్యను తాలెగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తన భర్తను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశారని పోలీసుల విచారణలో పేర్కొంది చనిపోయిన సూరజ్ భార్య కల్పన. దీంతో కేసు నుంచి తేలికగా బయటపడవచ్చని అనకుంది. కానీ ఆమె బూటకం ఎక్కువ సేపు నిలువలేదు. చివరగా పోలీసుల విచారణలో తను అసలు నిజాన్ని అంగీకరించాల్సి వచ్చింది. అంతే కాకుండా తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే వీరిద్దరి పెళ్లి మూడు నెలల క్రితమే జరిగింది. సూరజ్ ఓ కళాశాలలో ఉద్యోగం చేస్తుండేవాడు.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
Read Also:Minister Malla Reddy: సురారం పీఎస్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
పెళ్లయిన తర్వాత సూరజ్ తనను శారీరకంగా హింసించేవాడని, తీవ్రంగా కొట్టేవాడని భార్య ఆరోపిస్తోంది. దీంతో విసిగి వేసారిన భార్య భర్తను హత్య చేయాలని పథకం వేసింది. ఆ ప్రకారం ఆదివారం సెలవు దినం కావడంతో సూరజ్ తన అత్తమామల ఇంటికి రాగా, అతడి భార్య వాకింగ్ కు తీసుకెళ్లింది. అటుగా పొలాల్లోనికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పటికే సూరజ్ ను చంపేందుకు ప్లాన్ చేసి కొందరిని కల్పన అక్కడ కాపు కాయించింది. వారంతా సూరజ్ కోసం మాటువేశారు. అక్కడికి సూరజ్ చేరుకోగానే ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తలేగావ్ దబాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. అయితే భార్యను పదే పదే ప్రశ్నించడంతో అంతా బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్యను తలేగావ్ దభాడే పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also:Minister Amarnath: రెండు రైళ్లలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించాం..
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!