Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punam Raut Retires: “ఎంతో ఆలోచించుకున్నా. అన్నీ బాగా బేరీజు వేసుకున్న తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను” అని భారత మహిళా క్రికెట్ జట్టు కీలక బ్యాటర్ పూనమ్ రౌత్ భావోద్వేగం వ్యక్తం చేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలోనే అత్యున్నత గౌరవమని, క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చింది. పట్టుదలను నేర్పిందని, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. భారత జెర్సీని ధరించిన ప్రతిసారీ ఎంతో గర్వంగా, కృతజ్ఞతా భావంతో మైదానంలో అడుగుపెట్టానని, దేశం కోసం ఆడాలనే తన కల నిజమైందని, తనకు అందిన మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. భారత మహిళా క్రికెట్ జట్టు కీలక బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారంతో 37 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆమె, అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2009 నుంచి 2021 వరకు టీమిండియా తరఫున ఆమె 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20 మ్యాచ్‌లు ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ముఖ్యంగా భారత మహిళల జట్టు 2017 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడంలో పూనమ్ రౌత్ కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నమెంట్లో ఆమె 381 పరుగులు చేసింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో, భారత్ కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఆమె 86 పరుగుల పోరాట పటిమతో కూడిన ఇన్నింగ్స్ ఆడింది. ఐర్లాండ్‌తో జరిగిన అదే ప్రపంచ కప్ మ్యాచ్‌లో, ఆమె, దీప్తి శర్మ కలిసి రికార్డు స్థాయిలో 320 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, పూనమ్ చిరస్మరణీయమైన 109 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌ను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరిచిపోలేరు.
Also Read
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
వన్డేల్లోనూ పూనమ్ రౌత్ గణాంకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 34.83 సగటుతో మొత్తం 2299 పరుగులు చేసిన ఆమె, ఇందులో 3 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. 2009, 2013, 2017 వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో ఆమె టీమిండియా తరఫున బరిలో దిగింది. ఇక, 2017 ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ తన కెరీర్లో అత్యంత మధురమైన క్షణాల్లో ఒకటిగా నిలుస్తుందని రౌత్ గుర్తుచేసుకుంది. ఆ ట్రోఫీని తృటిలో కోల్పోయినప్పటికీ, ఆ టోర్నమెంట్లో జట్టు ప్రదర్శన భారత్‌లో మహిళా క్రికెట్ రూపురేఖలను పూర్తిగా మార్చివేసిందని, ఎంతో మంది యువతులకు స్ఫూర్తినిచ్చిందని, మన ఆట భవిష్యత్తును మార్చివేసిందని ఆమె రాసుకొచ్చింది.
టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే, పూనమ్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యి నిరాశపరిచినా, మూడో టెస్ట్‌లోనే అద్భుతమైన పునరాగమనం చేసింది. 2014లో మైసూర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అజేయంగా 130 పరుగులు చేసి సెంచరీ సాధించింది. ఇక టీ20 క్రికెట్లోనూ ఆమె తన వంతు పాత్ర పోషించింది. 27.65 సగటు, 92.17 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 719 పరుగులు చేసిన ఆమె, నాలుగు అర్ధశతకాలు సాధించింది. 2009, 2010, 2012, 2014 సంవత్సరాల్లో జరిగిన నాలుగు టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆమె ఆడింది. ఇందులో 2009లో పాకిస్థాన్‌పై 54 నాటౌట్‌తో మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ ఆడగా, 2014లో వెస్టిండీస్‌పై 52 బంతుల్లో 56 పరుగులు చేసింది. తన క్రికెట్ ప్రయాణానికి పునాది వేసిన డొమెస్టిక్ జట్లను కూడా పూనమ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. తన తొలి రోజుల్లో తనపై నమ్మకముంచిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
తాజావార్తలు
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!