Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు మృతి!
- 2019 ఫిబ్రవరి 14న పూల్వామాలో ఉగ్రదాడి
- ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లు
- నిందితుడు బిలాల్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుల్వామా ఉగ్రదాడి నిందితుడు బిలాల్ అహ్మద్ కుచేయ్ గుండెపోటుతో మృతి చెందాడు. 32 ఏళ్ల బిలాల్ జమ్మూకశ్మీర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలోని 18 మంది నిందితుల్లో బిలాల్ ఒకడు.
బిలాల్ అహ్మద్ కుచేయ్.. జమ్మూకశ్మీర్ కాకాపోరాలోని హజీబల్ గ్రామానికి చెందినవాడు. పుల్వామా సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి సంబంధించిన కేసులో బిలాల్ ప్రస్తుతం జైల్లు శిక్ష అనుభవిస్తున్నాడు. సెప్టెంబరు 17న అతడు తీవ్ర అనారోగ్యంకు గురి కాగా.. జైలు అధికారులు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో బిలాల్‌కు గుండెపోటు కూడా వచ్చింది. బిలాల్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Also Read: Tata Nexon iCNG: ‘నెక్సాన్ ఐసీఎన్జీ’ లాంచ్.. 6 ఎయిర్ బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల ప్రయాణం!
2019 ఫిబ్రవరి 14న పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. అవంతిపొర సమీపంలో జరిగిన ఈ దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 2020 ఆగస్టు 25న 18 మంది నిందితులపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు పాకిస్థానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుల్లో బిలాల్ అహ్మద్ కుచేయ్ ఒకడు.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!