హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి.. నేడు కూడా ఆందోళన చేపట్టేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిన్న రణరంగంగా మారింది. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదును చేసేందుకు 20 జేసీబీతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండడం పట్ల విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు..
Narasapur: నర్సాపూర్ టౌన్‌లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్యారానగర్‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట…
HYDRA Commissioner: హైదరాబాద్‌లోని మణికొండ, మంచిరేవులలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో నిర్మించిన మార్నింగ్ రాగా గేటెడ్ కమ్యూనిటీని ఆయన సందర్శించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వినియోగించడంపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో పాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు…