ప్రముఖ కన్నడ నటుడు శివరాం కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సీని పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగింది. ఈ మధ్య కాలంలో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ మృతి నుంచి కన్నడ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాగా తాజాగా మరోనటుడు మరణించిన వార్తను కన్నడ సీని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజా కార్యక్రమాలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకులారు. శివరాంను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. వయస్సు రీత్యా ఆయనకు సర్జరీ చేయలేమని వైద్యులు పేర్కొన్నారు. వారం కిందట శివరాంకు కారు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.
1938 జనవరి 28న జన్మించిన శివరాం 1958లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన సీని కెరీర్‌ను ప్రారంభించారు. కేఆర్ సీతారామ శాస్త్రీ, పుట్టన్న కనగల్, సింగీతం శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకుల వద్ద శివరాం పనిచేశారు. 1965లో బెరత జీవ అనే చిత్రంతో నటుడిగాను తెరంగ్రేటం చేశారు. ఆపై సహాయనటుడిగాను శివరాం సత్తా చాటారు. 1972లో హృదయ సంగమ అనే చిత్రంతో శివరాం దర్శకుడిగా మారారు. కన్నడలో పలు సినిమాలు నిర్మించిన శివరాం రజనీకాంత్‌తో తమిళంలో ధర్మదురై అనే సినిమాను నిర్మించారు.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
1985లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘గిరఫ్తార్’ నిర్మించింది ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, రజనీకాంత్ కలిసి నటించడం విశేషం. 2010-11 ఏడాదికిగాను డాక్టర్.రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్‌కు బహుకరించింది. అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు ఈయనను వరించింది. శివరామ్ మృతిపట్ల కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీరని లోటుని ఆయన అన్నారు. శివరాం కన్నుమూయడంతో ఆయన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా శోకసంద్రంలో మునిగారు.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..